ETV Bharat / state

నిరుద్యోగులను తెరాస మోసం చేసింది: జానారెడ్డి - తెలంగాణ వార్తలు

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో తిరుమలగిరి మండలం చింతలపాలెంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పర్యటించారు. గ్రామస్థులతో తనకున్న అనుభవాలను నెమరువేసుకున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు.

congress-senior-leader-jana-reddy-fires-on-trs-government-at-chintalapalem-in-nalgonda-district
నిరుద్యోగులను తెరాస మోసం చేసింది: జానారెడ్డి
author img

By

Published : Mar 5, 2021, 6:01 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ రాకముందే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇచ్చిన హామీలను తెరాస ప్రభుత్వం మర్చిపోయిందని... నిరుద్యోగులను మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆరోపించారు. సభలు సమావేశాలు లేకుండా గ్రామాల్లో సాదా సీదాగా ఆయన పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి మండలం చింతలపాలెంలోని శ్రీ కోదండ రామాలయంలో పూజలు చేసి... ఆలయ ప్రాంగణంలో గ్రామస్థులతో ముచ్చటించారు.

గ్రామస్థులతో తనకు గతంలో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. మొదటి సారి మంత్రి పదవి వచ్చినపుడు రామాలయానికి వచ్చానని... కులాలు, మతాలకు అతీతంగా చింతలపాలెం గ్రామస్థుల గుండెల్లో జానారెడ్డి ఉంటారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు రైతులకు గుదిబండగా మారాయని అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ఇదీ చదవండి: రేప్ కల్చర్​ను అంతమొందించండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.