ETV Bharat / state

సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్​ను గెలిపించండి: జానారెడ్డి - మైనారిటీ నేతలతో జానా సమావేశం

ఎన్నికలగానే తెరాస నాయకులు హడావుడిగా ప్రజలను కలిసేందుకు వస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్​లోని ఆయన నివాసంలో ముస్లిం మైనారిటీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

congress nagarjuna  sagar
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి
author img

By

Published : Apr 7, 2021, 9:51 PM IST

తెరాసకు తగిన బుద్ధి చెప్పాలంటే సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్​ను గెలిపించాలని అభ్యర్థి జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్​లోని ఆయన నివాసంలో ముస్లిం మైనారిటీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికలు వస్తేనే తెరాస నాయకులు కనిపిస్తారని ఎద్దేవా చేశారు.

తెరాస నాయకులు డబ్బులు, మద్యం పంచడం కోసం నెల రోజులుగా హడావుడి చేస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. సాగర్ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే మైనారిటీల హామీలన్నీ నెరవేరుస్తానన్నారు. త్వరలో ముస్లింలకు అన్ని సదుపాయాలు కలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్ నేత షబ్బీర్​ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'అత్యవసరమైతేనే బయటకి రండి.. కరోనా వస్తే బెడ్లు దొరకవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.