తాను ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి టర్న్‌లు తీసుకోలేదని...భాజపాలోకి వెళ్తున్నట్లు చెప్పలేదన్నారు. కాంగ్రెస్ నాయకత్వం తప్పులు చేస్తుందని బాధతో, ఆవేదనతోనే తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని వ్యక్తిగతంగా అన్నానని పేర్కొన్నారు. అందరిని కలుపుకోవడంలో కుంతియా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తుందని విమర్మించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తాను ఉద్యమం చేస్తానన్నారు. ఇప్పుడు సీఎల్పీ లేదని...కాంగ్రెస్ సభ్యులం మాత్రమేనన్నారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే సిద్ధంగానే ఉన్నానని వెల్లడించారు.
ఇవీచూడండి: దేశమంతా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది..!