ETV Bharat / state

అద్దంకి రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా

author img

By

Published : Nov 24, 2020, 5:51 PM IST

Updated : Nov 24, 2020, 6:07 PM IST

నల్గొండ జిల్లా దామరచర్లలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అద్దంకి- నార్కెట్​పల్లి రహదారిపై ధర్నా నిర్వహించారు.

congress leaders protest on addanki by pass road at narketpally
అద్దంకి రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు ధర్నా

నల్గొండ జిల్లా దామరచర్ల వద్ద అద్దంకి-నార్కెట్​పల్లి రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్షానికి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా... పండించిన పంటకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 25 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రైతులు తెచ్చిన ధాన్యం తేమశాతం ఎక్కువగా ఉండటం వల్లనే కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం మబ్బుగా ఉండటం వల్ల రాత్రి వేళలో మంచు కురుస్తుండటం వల్ల తేమశాతం అధికంగా వస్తోందని రైతులు వాపోయారు. పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్​ నాయక్​, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్​ ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన కాంగ్రెస్

Last Updated : Nov 24, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.