హైదరాబాద్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మిషన్ భగీరథపై చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. నల్గొండ జిల్లా అనుములలో జానారెడ్డి ఇదివరకు ఉన్న ఇంటికి మిషన్ భగీరథ నల్లా నుంచి నీరు వచ్చే వీడియోను మంత్రి మీడియా సమక్షంలో చూపించారు.
అందుకు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి సాగర్లో కౌంటర్ ఇచ్చారు. తాను ఇప్పడు ఆ ఇంట్లో ఉండడం లేదని.. ఎప్పుడో అమ్మేశానని పేర్కొన్నారు. ఆ ఇంటికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇప్పటికీ పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. మీడియా వారు ఆ గ్రామాల్లో తిరిగితే తెలుస్తుందని అన్నారు. అందుకు ఉదాహరణ తన సొంత గ్రామం అనుముల, హాలియాలో ఎంత మందికి నీళ్లు వస్తున్నాయో మీడీయా వారు పరిశీలించి సీఎం కేసీఆర్కు తెలపాలని సూచించారు.
ఇదీ చూడండి : మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి