ETV Bharat / state

సాగర్​ సమరం: పట్టీపట్టనట్లు సీనియర్లు... సింగిల్​గా జానా ప్రచారం! - జానారెడ్డి ఎన్నికల ప్రచారం

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చావో...రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికల్లో హస్తం నేతలంతా అక్కడే మకాం వేసినా.. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక విషయంలో పట్టీపట్టనట్లు ఉంటున్నారు. అంతర్గత విబేధాలు పక్కన పెట్టి మరీ... దుబ్బాక అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన నేతలు ఇక్కడెందుకు పట్టించుకోవడంలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరో వైపు సాగర్‌ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి తనకున్న ఇమేజ్‌ తనను గెలిపిస్తుందన్న ధీమాతో ముందుకెళ్లుతున్నారు.

jana reddy
jana reddy
author img

By

Published : Apr 3, 2021, 12:38 PM IST

రాష్ట్రంలో వరుస ఓటములతో సతమమవుతున్న కాంగ్రెస్‌కు నాగార్జునసాగర్ ఉపఎన్నిక గట్టి సవాలుగా నిలిచింది. పట్టభద్రుల మండలి ఎన్నికల్లో విజయోత్సాహంతో ఉన్న తెరాసను... దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో దూకుడుతో ఉన్న భాజపాకు అడ్డుకట్ట వేయడం హస్తానికి కత్తిమీద సాములా మారింది. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటములతో హస్తం పార్టీ గ్రాఫ్ రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అయితే కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపలేక పోయింది.

పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదు..

రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సాగర్‌లో గెలవడం కాంగ్రెస్​కు అనివార్యం. కానీ మాజీ మంత్రి జానారెడ్డిని బరిలోకి దించిన కాంగ్రెస్‌... ప్రచారంపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టిసారించలేదు. ప్రారంభంలో బహిరంగ సభ నిర్వహించిన తరువాత.. ఆ జోష్ ఇప్పుడు లేదు. దుబ్బాక ఉపఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా విభేదాలు పక్కన పెట్టి పనిచేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణికం ఠాగూర్ అయితే అక్కడే మకం వేసి పర్యవేక్షించారు. కానీ నాగార్జునసాగర్‌ విషయానికొస్తే... ఇప్పటి వరకు ఇంఛార్జీ ఠాగూర్‌ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

ముట్టనట్లుగా సీనియర్లు

జానారెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు అంతా ప్రచారంలో నిమగ్నమై... విజయానికి కృషి చేయాల్సి ఉంది. కానీ సీనియర్‌ నేతలు ప్రచారానికి దూరంగా ఉంటూ... అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏ మాత్రం గెలిచే అవకాశం లేని దుబ్బాకను తీవ్రంగా పరిగణించిన దిల్లీ పెద్దలు... సాగర్‌ ఉప ఎన్నికను పట్టించుకోవడంలేదన్న వాదన వినవస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోయిన తరువాత ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి ఇప్పటికే మూడునాలుగుసార్లు సాగర్‌ నియోజకవర్గాన్ని చుట్టేశారు. గ్రామాలకు వెళ్లడం.. ముఖ్యులను పిలిచి మాట్లాడటం లాంటివి చేశారు.

ఈ ఉప ఎన్నిక కీలకం

కానీ జానారెడ్డి పలుకుబడి ఓటర్లను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రచారంలో పాల్గొని జానారెడ్డి గెలుపునకు సహకరించాల్సి ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరో వైపు వరుస ఓటములతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కీలకంగా మారింది. ఇక్కడ విజయం సాధించకపోతే పార్టీ పరిస్థితులు రాష్ట్రంలో మరింత అధ్వాన్నంగా మారే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి : వాట్సప్‌ వలపు: నగ్నంగా చూడాలనుకుంటున్నావా? అంటూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.