నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గేట్ వద్ద కాంగ్రెస్, తెరాస శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస కార్యకర్తలపై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు! పార్టీ అభ్యర్థి పుల్లయ్య నామినేషన్ ఉపసంహరణపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాసతో కుమ్మక్కై పుల్లయ్య నామినేషన్ ఉపసంహరించుకున్నాడని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.