సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాపై వరాలు కురిపించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షలు ఇస్తామన్నారు. నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నెల్లికల్లు, చింతలపాలెం ప్రాంతాల్లో భూవివాదం ఉందని.. ఈ సమస్య పరిష్కరించి త్వరలో పట్టాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. కరోనా కారణంగా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని త్వరలో కొత్త పింఛన్ల ప్రక్రియ చేపడతామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన