ETV Bharat / state

30 ఏళ్ల అనుభవం ఉన్నా అభివృద్ధి సున్నా: కేసీఆర్​

జానారెడ్డికి 30 ఏళ్ల అనుభవం ఉన్నా నాగార్జునసాగర్​ నియోజకవర్గానికి చేసింది శూన్యమని సీఎం విమర్శించారు. హాలియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

kcr
సీఎం కేసీఆర్​
author img

By

Published : Apr 14, 2021, 7:02 PM IST

నాగార్జునసాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డిపై సీఎం కేసీఆర్​ విచుకుపడ్డారు. జానారెడ్డికి 30 ఏళ్ల అనుభవం ఉన్నా నియోజకవర్గానికి చేసింది శూన్యమని విమర్శించారు. హాలియాకు డిగ్రీ కళాశాలను కూడా తీసుకురాలేదన్నారు. నందికొండకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్​

కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసమే పాకులాడారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నామని కేసీఆర్​ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ పథకాలు గతంలో ఉన్నాయా? అంటూ సీఎం ప్రశ్నించారు. పైరవీలు, మధ్యవర్తులు లేకుండా అందరికీ రైతుబంధు ఇస్తున్నామన్నారు.

ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా రైతు ఖాతాలో జమ అవుతోందని చెప్పారు. ప్రతి గ్రామానికి ప్రతి రోజూ మిషన్ భగీరథ జలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఏ మాయనే నల్లగొండా.. నీ గుండెల నిండా ఫ్లోరైడ్ బండా అని నేనే పాట రాశానని తెలిపారు. రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టి తాగునీటి కష్టాలు తీర్చామన్నారు. తాగునీటి కష్టాలు తీర్చాం, త్వరలోనే సాగునీటి కష్టాలు పూర్తిగా తీర్చుతామని చెప్పారు.

ఇదీ చదవండి: కరోనా మొదటి వేవ్​కు రెండో వేవ్​కు చాలా తేడా ఉంది: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.