నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తన నామినేషన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టతనిచ్చారు. ఈనెల 30న ఆయన నామపత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదట 29న నామినేషన్ వేయాలనుకున్నా... సెలవుదినం కావడం వల్ల 25, 26, 30 తేదీలు మాత్రమే ఉన్నాయి.
ఈనెల 27, 28, 29 సెలవు దినాలు ఉన్నట్లు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటన విడుదల చేశారు. ఇక నామినేషన్లు దాఖలు చేయడానికి ఈనెల 30 చివరి తేదీ కావడం వల్ల జానారెడ్డి 25, 26న నామినేషన్ వేసే అవకాశం చాలా తక్కువ. 30న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్వాధీనం