ETV Bharat / state

'భాజపా, తెరాస కలిసి రైతులను మోసం చేస్తున్నాయి' - polam bata poru bata started nalognda district

భాజపా, తెరాస కలిసి రైతులను పూర్తిగా మోసం చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తంగపాడులో పొలంబాట-పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

clp leader bhatti comment BJP, trs together cheating farmers
'భాజపా, తెరాస కలిసి రైతులను మోసం చేస్తున్నాయి'
author img

By

Published : Feb 19, 2021, 7:23 PM IST

'భాజపా, తెరాస కలిసి రైతులను మోసం చేస్తున్నాయి'

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడులో 'పొలం బాట-పోరుబాట' కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ట్రాక్టర్​ను స్వయంగా నడుపుకుంటూ తుంగపాడు రైతు ర్యాలీలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన సమస్యలపై చర్చించారు. నాగార్జునసాగర్ సహా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల పుణ్యం వల్లనే మనమందరం అన్నం తింటున్నామని భట్టి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా మద్దతు ధరతోపాటు, ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల సాయంతో.. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి

నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర చట్టాల వల్ల గిట్టుబాటు ధర ఉండదని... రైతులు నష్టాలను తట్టుకుని నిలబడలేని పరిస్థితి వస్తుందన్నారు. రైతులు తమ భూములు అమ్ముకుని ఉన్న ఊర్లోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. రైతులకు ఉపయోగపడే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి.. ఆర్థిక స్వావలంబనను నిర్వీర్యం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పడం, ఆ తర్వాత మోసం చేయడం కేసీఆర్ నైజం అన్నారు.

ఓట్లు అడగడానికి రాలేదు

రైతు సమస్యలను తెలుసుకోవడానికే ఈ పొలంబాట-పోరుబాట కార్యక్రమాన్ని ఎంచుకున్నామని సీఎల్పీ నేత వెల్లడించారు. రాజకీయాలు మాట్లాడటానికో, ఎలక్షన్ల ఓట్లు అడగడానికి రాలేదని చెప్పారు. నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నర్సిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : నేటి నుంచే చెర్వుగట్టు జాతర.. రేపు కల్యాణ వేడుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.