Chityala Municipality: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ అధికారులు పన్ను వసూళ్లను సీరియస్‌గానే తీసుకున్నారు. నయానో భయానో చెబితే కుదరడం లేదని.. ఏకంగా జప్తుకే సిద్ధమయ్యారు. ముందుగా ఆస్తిపన్ను చెల్లించని యజమానులకు నోటీసులు జారీ చేశారు. అప్పుడైనా వారు పన్ను చెల్లిస్తారేమోననే ఆశతో అధికారులు చూశారు. లాభం లేదనుకొని సకాలంలో చెల్లించని వారిపై అధికారులు కొరడా ఝలిపించారు.
మున్సిపల్ సిబ్బంది బకాయిల వసూలు కోసం ప్రత్యేక రైడ్ చేపట్టారు. అందులో భాగంగారూ.8వేలు బకాయి ఉన్న ఓ యాజమాని ఇంటి గేటును తొలగించారు. వాటిని కార్యాలయానికి తరలించారు. వ్యాపారసంస్థలు సైతం పన్ను చెల్లించక పోవడంతో దుకాణాలకు తాళాలు వేశారు. ఇదీ చూసిన కొంత మంది వెంటనే బకాయిలు చెల్లించేందుకు మున్సిపల్ ఆఫీస్‌కు పరుగులు తీశారు. మరికొందరేమే.. పన్ను కట్టకపోతే.. ఇంట్లోవి లాక్కుపోతారా.. ఇదేం చోద్యమంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: Adilabad Municipal Office: మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన భాజపా కార్యకర్తలు