పార్లమెంట్,మండలి ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. చిరుమర్తి గులాబీకండువా వేసుకునేందుకు ఆసక్తి చూపించగా సీఎం ఆమోదించినట్లు సమాచారం. ఇప్పటికే పినపాకఎమ్మెల్యేరేగాకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత మరికొంత మంది పేర్లు తెర మీదకు వచ్చాయి.
తెరాస ఆహ్వానం:
ఈ నెల 2న టీపీసీసీ అధ్యక్షుడు శాసనసభ్యులకు ఏర్పాటు చేసిన విందుకు చిరుమర్తి గైర్హాజరు కావటంతో ఆయనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మండలి ఎన్నికల కోసం ఈనెల 10న తెరాస ఎమ్మెల్యేలతో పార్టీ అధిష్ఠానం సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశానికి సండ్ర వెంకట వీరయ్య, కాంతారావు, ఆత్రం సక్కులతో పాటు లింగయ్యలను తెరాస ఆహ్వానించినట్లు సమాచారం.
ఇవీ చూడండి:నేడు నాగర్కర్నూల్, చేవెళ్లలో కేటీఆర్ సభలు