ETV Bharat / state

మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్​కు షాక్.. - పల్లె రవికుమార్ గౌడ్ తాజా వార్తలు

మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. చండూరు ఎంపీపీగా కొనసాగుతున్న కాంగ్రెస్​ పార్టీకి చెందిన పల్లె కల్యాణి దంపతులు తెరాసలో చేరారు. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

munugode by elections
munugode by elections
author img

By

Published : Oct 15, 2022, 4:08 PM IST

మునుగోడు కాంగ్రెస్‌ నేత పల్లె రవికుమార్‌ గౌడ్‌ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పల్లె రవికుమార్‌ గౌడ్ దంపతులను కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్.. మళ్లీ తెరాస పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం తెరాసలో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్‌కు కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని తెలిపారు. కేటీఆర్ సమక్షంలో ఎలాంటి షరతుల్లేకుండా పార్టీలో చేరామని పల్లె రవికుమార్ తెలిపారు.

చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కి తెలియజేస్తే.. సానుకూలంగా స్పందించారని పల్లె రవికుమార్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి: TRSకు రాజీనామా.. అందుకే చేశా: బూర నర్సయ్యగౌడ్‌

మును'గోడు' పట్టని పార్టీలు.. ప్రచారాల్లో పరస్పర ఆరోపణలకే పరిమితం

ఇంకా తగ్గని ఆకలి బాధలు.. హంగర్​ ఇండెక్స్​లో భారత్​కు 107 స్థానం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.