ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

car fell down in canal
కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి
author img

By

Published : Feb 27, 2020, 9:26 AM IST

Updated : Feb 27, 2020, 12:06 PM IST

09:22 February 27

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

            నల్గొండ జిల్లా పెద్దఆడిశర్లపల్లి మండలం దుగ్యాల వద్ద... ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కారులో ఉన్న దంపతులతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోగా... కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. పీఏపల్లి మండలం ఒడ్డెరగూడెం గ్రామానికి చెందిన ఓర్సు రఘు కుటుంబం... కొన్నేళ్లుగా హైదరాబాద్​లో నివాసం ఉంటోంది. బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టిన ఈ కుటుంబం... రెండ్రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది.  

               ఉదయం అప్రోచ్ దారిలో ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పిన వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది. వారం వ్యవధిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. గత శుక్రవారం రామన్నపేట మండలం వెల్లంకి సమీప చెరువులోకి కారు దూసుకెళ్లడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు కూడా అదే రీతిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 15రోజుల క్రితం కరీంనగర్ జిల్లా కాకతీయ కాలువలోకి కారు దూసుకెళ్లి.. భార్య, భర్త, కూతురు జలసమాధి అయ్యారు. 

ఇవీ చూడండి: ట్రాక్టర్​ను ఢీకొట్టిన లారీ.. ఒకరి మృతి

Last Updated : Feb 27, 2020, 12:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.