ETV Bharat / state

మిర్యాలగూడలో గుప్పుమంటున్న గంజాయి..! - telangana varthalu

ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గంజాయిని సేవిస్తూ కొందరు విద్యార్థులు నిండు జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా నిషేధిత గంజాయి ఎక్కువగా వాడుతున్నారు. సిగరెట్​లోని పొగాకు మధ్యలో పెట్టుకుని తాగడంతో గంటలకొద్ది మత్తు ఉంటుంది. రాజధానికి సమీపంలో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా గంజాయితో తయారుచేసిన విడాయిల్​ను మత్తుకోసం కొంతమంది వాడుతున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా జరిగే అనర్థాలు ఆగడం లేదు.

మిర్యాలగూడలో గుప్పుమంటున్న గంజాయి..!
మిర్యాలగూడలో గుప్పుమంటున్న గంజాయి..!
author img

By

Published : Sep 30, 2021, 5:19 PM IST

నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో గంజాయి వాడకం ఎక్కువైంది. ఈ మధ్య పోలీస్ స్టేషన్లలో నమోదయిన కేసులే దీనికి సాక్ష్యంగా తెలుస్తుంది. మిర్యాలగూడ వన్​టౌన్ పోలీస్ స్టేషన్​లో 5 గంజాయి కేసులు. టూ టౌన్ పీఎస్​ పరిధిలో ఐదు.. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు గంజాయి కేసులు నమోదయ్యాయి. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదైనట్టు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. మిర్యాలగూడలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతుండడంతో... పట్టణంలో దీని వాడకం ఏ మేరకు ఉందో తెలుస్తోంది. కొంతమంది దళారులు ఇదే పనిగా విశాఖపట్నం, భద్రాచలం, శ్రీశైలం అడవుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులు, రైలు మార్గాల ద్వారా వీటిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. యువత గంజాయి మత్తులో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మిర్యాలగూడలోని రైల్వే స్టేషన్, అగ్రిగోల్డ్ వెంచర్, అద్దంకి-నార్కెట్​పల్లి రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నిర్జన ప్రదేశాల్లో కొంతమంది యువకులు గుంపులుగా చేరి గంజాయిని పీల్చుతూ మత్తులో తేలుతున్నారు. గంజాయి మత్తులో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు.

నల్గొండ జిల్లావ్యాప్తంగా ఈ మధ్యకాలంలో గంజాయి అమ్మకాలు గుట్టుచప్పుడుగా సాగుతున్నాయి. జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మిర్యాలగూడలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. కొంతమంది గంజాయికి అలవాటు పడ్డ యువకులు అధిక మత్తు ఉండే ఎల్​ఎస్​డీ, ఏడీఎంఏ వంటి మత్తుపదార్దాలు వాడే స్థాయికి చేరుకున్నారు. మిర్యాలగూడ రెండో పట్టణ పోలీసులు ఈ నెల 14న నల్లమందు వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద కొద్ది మొత్తంలో నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లులో పనిచేసే బిహారీ యువకులు, ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు కొందరు శ్రమను మర్చిపోవడానికి గంజాయి మత్తుకి అలవాటుపడ్డట్టుగా తెలుస్తోందని మిర్యాలగూడ పోలీసులు చెబుతున్నారు. మిర్యాలగూడ పట్టణంలో ఈ తరహాగంజాయి రవాణా, వాడకం ఎక్కువగా ఉందని... యువత గంజాయి మత్తులో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని... సమాజంలో మహిళల భద్రత పెరగాలంటే గంజాయి రవాణాను అరికట్టడం ఎంతైనా అవసరమని... పట్టణంలోని నిర్జన ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచి గంజాయి వాడకాన్ని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

గంజాయి, మత్తుమందుల వాడకంతో పాటు అమ్మకాల్లో సంబంధం ఉన్నట్లు తేలితే కేసులు నమోదు చేస్తున్నామని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ విషయంలో కేసు రుజువైతే శిక్షలు కఠినంగా ఉంటాయని... 10 నుంచి 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా ఉంటుందని.. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను కదలికలను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు. యువత చెడు అలవాట్లకు పోకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. గంజాయిని అరికట్టడానికి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని.. ప్రజలు దీనికి సహకరించాలని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Junior Artist Suicide : ఆరేళ్లుగా సహజీవనం...టాలీవుడ్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.