ETV Bharat / state

తృటిలో తప్పిన ప్రమాదం...ప్రయాణికులు సురక్షితం - నల్గొండ జిల్లాలో ప్రమాదం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ రోడ్డులో దెయ్యాల గండి వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు లోయ పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీశారు.

Bus turn into road side at nagarjunasagar in nalgonda district
తృటిలో తప్పిన ప్రమాదం...ప్రయాణికులు సురక్షితం
author img

By

Published : Nov 26, 2020, 6:51 PM IST

నల్గొండ జిల్లాలో తృటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. దిల్​సుఖ్​నగర్ నుంచి మార్కాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు నాగార్జునసాగర్ దెయ్యాల గండి వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి ఒరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును బయటకు లాగారు. రహదారిపై లారీ, కారు డ్రైవర్ల గొడవే ప్రమాదానికి కారణమని తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:'ఎన్టీఆర్, పీవీపై భాజపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.