ETV Bharat / state

ఆ ఊర్లో బడి.. బస్టాండు... శ్మశానం పక్కపక్కనే - smashanam

శ్మశానవాటిక అంటే ఊరి చివర్లో ఉండాలి. జనావాసాల మధ్య ఉంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కానీ బడి పక్కనే ఉంటే పిల్లలకు నిజంగా పరీక్షే. ఊర్లో ఎవరైనా చనిపోతే.. ఆ విద్యార్థులు భయంతో వణికిపోతారు.

ఆ ఊర్లో బడి.. బస్టాండు... శ్మశానం పక్కపక్కనే
author img

By

Published : Aug 4, 2019, 8:57 PM IST

నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే శ్మశాన వాటిక ఉంది. ఎవరైనా చనిపోయి, శ్మశానవాటికకు తీసుకొస్తే ఆ రోజు పాఠాలు చెట్లకిందనే. తరగతి గది కిటికీ తీస్తే... ఆ దృశ్యాలే కనిపిస్తాయి. ఏడుపులు, డప్పు చప్పుళ్లకు పిల్లలు వణికిపోతున్నారు. నిద్రలోనూ కలవరిస్తున్నారు. శవాన్ని దహనం చేస్తున్నప్పుడు వచ్చే పొగతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అస్వస్థతకు గురవుతున్నారు.

శ్మశానానికి పక్కనే బస్టాండు కూడా ఉంది. అక్కడికి వచ్చే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వాళ్లు ఆ రోజంతా బయటకు రాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి తరలించాలని శాసనసభ్యునికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోయారు. పైగా శ్మశానంలో వసతులు కల్పిస్తూ... అభివృద్ధి చేస్తున్నారని విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఊర్లో బడి.. బస్టాండు... శ్మశానం పక్కపక్కనే

ఇదీ చూడండి: గాడిదల పెళ్లికి ఊరి పెద్దల హడావుడి!

Intro:TG_NLG_111_28_Smasanavaatika_Pkg_Ts10102

పరమేష్ బొల్లం
మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లా
9966816056

( )

పాఠశాల పక్కనే స్మశానవాటిక.....

స్మశానవాటిక అంటే.....ఉరి చివర్లో నే ఉండాలి ....జనవాసాల మద్య ఉంటే ప్రజలు నిత్యం ఆ ఎదుపులు విన్నప్పుడు ఇబ్బందులు పడతారు...... శవం కాలబెట్టినప్పుడు వచ్చే దుర్వాసన సమస్యతో రోగాల బారిన పడుతుంటారు....ఇవే కాకుండా ఈ స్మశానవాటిక పాఠశాల ను అనుకోని ఉండడం వల్ల ఆ ఈ పాఠశాల విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు...

look
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రం లో స్మశానవాటిక కలదు. ఇది మండలకేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను అనుకోని ఉండడంతో ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ రోజంతా చెట్ల కిందే పాఠాలు చెపుకోవాల్సివుంటుంది.తరగతి కిటికీ నుండి చూడగానే ఆ స్మశానవాటికలో నుండి వచ్చే ఏడుపులు, డప్పు ల చప్పుడు కు కొంతమంది విద్యార్థులు బయం తో వణికి పోతూ ఇంటికి వెళ్ళాక సైతం నిద్రలో కలవరింపులు చేస్తున్నారని ఆ విద్యార్థులు అంటున్నారు. దీనికి సమీపంలో బస్టాండ్ ఉన్నది ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ఎక్కడికైనా వెళదామని బస్టాండకు రాగానే ఈ ఏడుపులు వినపడగానే ఒక అపశకణంగా బావిస్తున్నారు.శవము కాల్చిన ప్పుడు వచ్చే దుర్వాసనను భరించలేక చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు తలుపు లు వేసుకొని ఆ రోజంతా గడపాల్సిన పరిస్థితి దాపురించింది.

*ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేదు *

ఈ స్మశానవాటికను తొలగించాలని గతంలో ఎన్నో సార్లు పాఠశాల విద్యార్థులు ,సిబ్బంది స్ధానిక శాసన సభ్యుడికి సర్పంచ్ కి ఎన్నో సార్లు వినతులు సమర్పించిన ప్రయోజనం చేకూరలేదని .ప్రయోయజనం లేక పోవడమే కాకుండా ఇంకా దానిని అభివృద్ధి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.

ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ స్మశానవాటికను తొలగించి ఉరి చివర్లో ఏర్పాటు చేసి పాఠశాలల సజావుగా నడిచేటట్టు సహకరించాలని విద్యార్థులు స్థానికులు కోరుతున్నారు..

Body:మునుగోడు నియోజకవర్గం
నల్గొండ జిల్లా

Conclusion:పరమేష్ బొల్లం
9966816056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.