భాజపాకు కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదని.. ప్రజలను కాపాడుకోవడమే పార్టీ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్‌షో అనంతరం సంజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిజాం చక్కెర కర్మాగారాన్ని ఎందుకు తెరవలేకపోయారని బండి ప్రశ్నించారు. ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు.