అమరుల త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని... భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన మహిళా గర్జన సభలో ఆమె పాల్గొన్నారు. ప్రధాని మోదీ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.
సీఎం కుర్చీ.. తన ఎడమ కాలి చెప్పు అని చెప్పుకున్న వ్యక్తి, పదవి కోసం ఎందుకు ఆరాటపడుతున్నారో తెలపాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే సమయమివ్వని ముఖ్యమంత్రి.. సామాన్య ప్రజలనెలా కలుస్తారని ఎద్దేవా చేశారు. కొడుకును పీఠం ఎక్కించడానికి.. కేసీఆర్ తాపత్రయ పడుతున్నారన్నారు.
ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్కు హామీలు గుర్తొస్తాయని డీకే అరుణ వివరించారు. సాగర్ నియోజకవర్గానికి తెరాస చేసిన అభివృద్ధేమీ లేదన్నారు. ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థినే గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా వేయాలి'