MP Laxman fire on KCR: మోదీ సర్కార్‌ను విమర్శించే ముందు రాష్ట్ర ప్రభుత్వంలోని లోటుపాట్లను సరిచేసుకోవాలని భాజపా ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. భాజపా పాలిత రాష్టాల్లో ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తిపడుతుందని దుయ్యబట్టారు. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు చేర్చారని విమర్శించారు.
ఇప్పటి వరకూ 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 2 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. 1.2 లక్షల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులు, 756 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అర్థం లేని విమర్శలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.
"యువకులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు యువకులే ఆగంమైపోతున్నారు. ఉపఎన్నికలు వస్తే కేసీఆర్కు ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయి. 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు చేర్చి ఎంతో అవినీతికి తెరలేపారు. ఇప్పటి వరకూ 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదన్నారు. ఈ రోజు రైతులు చేసిన అప్పులు తీర్చుకోలేక రైతులు నడ్డి విరుగుతోంది."- కె.లక్ష్మణ్, భాజపా ఎంపీ
ఇవీ చదవండి: