ETV Bharat / state

ఇకనైనా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవొద్దు: భాజపా - నల్గొండలో భాజపా ధర్నా తాజా వార్త

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట భాజపా నేతలు ధర్నా చేపట్టారు. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 2500 మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

bjp leaders protest in front of miryalaguda rdo office in nalgonda district
ఇకనైనా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవొద్దు: భాజపా
author img

By

Published : Nov 7, 2020, 9:50 PM IST

కేసీఆర్​ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని భాజపా నేతలు ఆరోపించారు. సన్నరకాలను వేసిన అన్నదాతలు మద్ధతు ధరరాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యానికి ధర రూ. 2500 ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఇకనైనా ప్రభుత్వం.. నియంత్రిత సాగే చెయ్యాలని రైతుల మీద ఒత్తిడి తేవొద్దని.. భూసారాన్ని బట్టి ఎలాంటి పంట వేస్తే లాభాలు వస్తాయో ఆవిధంగా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పేదల ఆకలి తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.