భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఇవాళ నల్గొండలోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ హాజరయ్యారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పాదయాత్రలో జిల్లా భాజపా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గ్యాస్‌తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిపి చంపేశాడు