నల్గొండ జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ పట్టణంలో పలు ప్రధాన కూడళ్లలో ర్యాలీ చేశారు.
ఈ చట్టం కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని... మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్