వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రశాంతంగా కొనసాగుతోంది. వామపక్ష పార్టీల నేతలు ఆర్టీసీ బస్టాండ్ ముందు నిరసన వ్యక్తం చేశారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవడం లేదని వాపోయారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. వాటిని అరికట్టే దిశగా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్‌లో పాల్గొన్న కార్మిక, కర్షక, మేధావి వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: పోరాడి ప్రేమను గెలిచింది.. నచ్చినవాడిని మనువాడింది