రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ చట్టాల వల్ల రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని భాజపాయేతర నాయకులు డిమాండ్ చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉదయం ఐదు గంటల నుంచే ఆందోళన చేపట్టారు.
కొత్త చట్టాలతో రైతు పండించిన పంటకు మద్దతు ధర పొందే అవకాశం లేదని... కార్పొరేట్ శక్తుల కోసమే మోదీ ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఎముకలు కొరికే చలిలో రైతులు ఆందోళన చేస్తున్నా... చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఆ చట్టాలను ఉపసంహరించే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో తెరాస, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పాల్గొన్నాయి.
ఇదీ చదవండి: రైతు భవిత పరాధీనం- అందుకే అన్నదాత ఆగ్రహం!