ETV Bharat / state

బీజీ-3తో మహా డేంజర్​.. మనుషులకే కాదు పర్యావరణానికీ ముప్పే.!

నకిలీ విత్తనాల పేరిట మాయాజాలం కొనసాగుతోంది. పెద్దమొత్తంలో విత్తనాలు దొరుకుతున్నాయి కానీ పట్టుబడినవి ఎటువంటివి... ప్రమాదకరమైనవి అందులో ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో బీజీ-2 తరహా విత్తనాలకు అనుమతి ఉన్నా... వాటిలో నకిలీవి విపణిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ నిషేధిత బీజీ-3 విత్తనాలు అడ్డగోలుగా సరఫరా అవుతుండటం విపరిణామాలకు దారితీసే ప్రమాదముంది.

bg 3 fake seeds
బీజీ 3 నకిలీ విత్తనాలు
author img

By

Published : Jun 23, 2021, 5:19 PM IST

నకిలీ విత్తనాల వల్ల పెద్దగా దిగుబడులు రాక... రైతులు నష్టాల పాలవుతుంటారు. వర్షాధార ప్రాంతాల్లోని సాగుదారులే లక్ష్యంగా నకిలీ బీజీ-2 విత్తనాలు సరఫరా చేస్తుంటారు. కానీ బీజీ-3 విత్తనాలు సరఫరా అవుతుండటం అత్యంత ప్రమాదకరం. ఈ నిషేధిత విత్తనాల వాడకం వల్ల మనుషులకే కాకుండా... పర్యావరణానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరించారు. అందుకే దీనికి కేంద్ర ప్రభుత్వం... అనుమతి ఇవ్వలేదు. బీజీ-2తో పోలిస్తే బీజీ-3 విత్తనాలు అత్యంత ప్రమాదకరమైనవి. బీజీ-2 విత్తనాలు వేశాక కలుపు వచ్చి గ్లైఫోసెట్ మందు కొడితే... కలుపుతోపాటు బీజీ-2 మొక్క కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ. దీంతో రైతులు పంటను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. అదే బీజీ-3 విత్తనాలు వేసి కలుపు వచ్చినపుడు గ్లైఫోసెట్ కొడితే... కేవలం కలుపు మాత్రమే పోయి మొక్క మిగులుతుంది. అందుకే సాగుదారులు ఈ తరహా విత్తనాలు వాడేందుకు సుముఖత వ్యక్తం చేస్తుంటారు.

మనుషుల పైనే కాదు

బీజీ-3 విత్తనాలు వేసిన పంటకు ఈ మందు వాడితే మనుషులతో పాటు పర్యావరణంపై ప్రభావం పడుతుంది. ఎంత ప్రమాదకరమంటే బీజీ-3లో గ్లైఫోసెట్ వాడుతున్న రైతులు సహా.. సమీప భూములున్న వారూ ప్రభావానికి లోనవుతారు. విపరిణామాల దృష్ట్యా జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ... జీఈఏసీ దాన్ని నిషేధించింది. బీజీ-2 విత్తనాలకు అనుమతి ఉన్నా... వాటిలో నకిలీవి అమ్ముతూ పోలీసులకు చిక్కుతున్నారు. కానీ బీజీ-2లో నకిలీవి ఉన్నా రైతులు పంట నష్టపోతారు మినహా.. ప్రాణాలకు, పర్యావరణానికి ప్రమాదం ఉండదు. అదే బీజీ-3 వాడితే... భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. అమెరికాలో ఇలాంటి ఘటనపై న్యాయపోరాటం చేస్తే... వందల కోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించారు.

వరుసగా పీడీ యాక్టులు

ఈ నెల 10న సూర్యాపేట జిల్లాలో... రూ. 13.51 కోట్ల విలువైన విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. అందులో 90 శాతం బీజీ-3 విత్తనాలే ఉన్నాయి. సదరు సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించబోతున్నారు. ఇక నల్గొండలో ఈ నెల 18న పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 6 కోట్ల విలువైన విత్తనాల్లో... బీజీ-3 తరహా విత్తనాలు లేవు. పట్టుబడినవన్నీ బీజీ-2లోని నకిలీవే. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకరిపై గతంలోనే పీడీ చట్టం నమోదైంది. అప్పుడు పట్టుబడిన సమయంలో సదరు నిందితుడి నుంచి... బీజీ-3 విత్తనాలు లభ్యమయ్యాయి. కానీ ఇప్పుడు కూడా ప్రధాన నిందితుడు అతడే అయినా... నిషేధిత విత్తనాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరంగా మారింది. మొత్తం 16 మందిని వెతికేందుకు హైదరాబాద్, కర్నూల్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లిన పోలీసు బృందాలు... 13 మందిని అదుపులోకి తీసుకున్నాయి. కానీ మరో ముగ్గురిని పట్టుకోలేకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

వాటిపై దృష్టి సారించాలి

పీడీ చట్టాన్ని ప్రయోగిస్తే గరిష్ఠంగా ఏడాది పాటు జైలులో ఉండాలి. కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆర్నెల్లు ముగియగానే బయటకు వచ్చే వీలుంది. నిందితులపై మే, జూన్​లో చట్టం ప్రయోగిస్తే... నవంబరు, డిసెంబరులో కారాగారం నుంచి బయటపడతారు. తిరిగి జనవరి నుంచి మళ్లీ... యథాలాపంగా కార్యకలాపాలు కొనసాగిస్తారు. జనవరి నుంచి పంటల సీజన్ పూర్తయ్యేవరకు మళ్లీ ఇదే తంతు. పీడీ చట్టాన్ని సంవత్సరాంతంలో ప్రయోగిస్తే... సీజన్ ముగిసేవరకు బయటకు వచ్చే వీలుండదు. తద్వారా మధ్యవర్తుల కార్యకలాపాలకు... అడ్డుకట్ట వేయవచ్చు. దీనిపైనే పోలీసులు దృష్టిసారించాల్సి ఉన్నా... అటువైపు ఆలోచించడం లేదు. పట్టుబడిన వాటిని ఎంత విలువైనవని లెక్కగడుతున్నారే తప్ప... అందులో నకిలీవెంత, ప్రమాదకరమైనవి ఎంత అని గుర్తించలేకపోతున్నారు.

ఇదీ చదవండి: Covid diet chart: కొవిడ్ టీకా రోజున డైట్ ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.