ఆడ బిడ్డలు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఎలాగైతే సారె పెడతారో.. తెలంగాణ ప్రభుత్వం అలాగే బతుకమ్మ చీరలతో సారె పెడుతోందని ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఒకటవ వార్డ్, గుండ్ల పల్లి, కాకుల కొండారం, పాతూరు, నర్సింగ్బట్ల గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో ఆడపడుచులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ అని అన్నారు. గత ప్రభుత్వాలు, నాయకులు తలపెట్టని ఎన్నో అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకువచ్చారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'నిరుపేదల మోములో బతుకమ్మ చీరలు ఆనందాన్ని నింపుతాయి'