ETV Bharat / state

'సాగర్' అభ్యర్థి ఎంపికపై సీనియర్​ నేతలతో చర్చించనున్న బండి - bandi sanjay meeting with senior leaders on sagar candidate

నాగార్జునసాగర్​ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నా.. భాజపా, తెరాస అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేడు పార్టీ సీనియర్​ నేతలతో చర్చించనున్నారు. అభ్యర్థి ఎంపికపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

bjp, bandi sanjay, nagarjuna sagar
నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక
author img

By

Published : Mar 27, 2021, 3:16 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం భాజపా అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ నేడు సీనియర్‌ నేతలతో చర్చించనున్నారు. ఆశావహుల అభిప్రాయాలను నేతలకు తెలపనున్నారు.

సీనియర్​ నేతలు సూచించిన పేరును బండి సంజయ్​ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. అభ్యర్థి ఎంపిక ఆదివారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఆశావహుల జాబితాలో అంజయ్య యాదవ్‌, నివేదితా రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, రవినాయక్‌లు ఉన్నారు. వీరితో శుక్రవారం అర్ధరాత్రి వరకు బండి సంజయ్​ చర్చలు జరిపారు.

ఇదీ చూడండి: నాగార్జునసాగర్​ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న కమలనాథులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.