పేదరికంలో ఉండి పిల్లలకు, గర్భిణీలకు సరైన ఆహారం అందించకపోవటం వల్ల రోగాల బారినపడుతున్నారు. పౌష్ఠికాహారం అందించి ఆరోగ్యం కాపాడాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. చాలా చోట్ల అవి సరైన వసతుల్లేక, పంచాయతీ, కమ్యూనిటీ హాల్స్, అద్దె భవనాల్లో, ఇరుకు గదుల్లో, కనీసం తాగునీరు, విద్యుత్ సౌకర్యం కూడా లేకుండానే నడుపుతున్నారు.
నల్లగొండ జిల్లా మునుగోడు, చండూరు మండలాల్లో 115 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా... కేవలం 19 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 48 కేంద్రాలు అద్దె భవనాల్లో, 46 కేంద్రాలు ఆయా గ్రామాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాల్లో కాలం వెల్లదీస్తున్నాయి. కొన్ని కేంద్రాలు మాత్రం శిథిలావస్థలో ఉన్న గదుల్లో నడుపుతున్నారు. అక్కడికి పిల్లల్ని పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సొంత భవనాలకు నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : కర్ణాటక: ప్రాణాల కోసం సాహసం చేయాల్సిందే.!