నల్గొండ జిల్లా వాడపల్లి చెక్పోస్ట్ వద్ద రాష్ట్రం నుంచి వెళ్లిన వలస కూలీలను ఆంధ్రా అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూలీలు వాపోతున్నారు. మహిళలు చిన్నపిల్లలతో ఉదయం నుంచి తిండి లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మొదట ఎస్పీ పాస్ ఉంటే ఆంధ్రా వెళ్లడానికి అనుమతి ఇస్తామని చెప్పినా.. పొందుగల చెక్ పోస్ట్ అధికారులు... డీజీపీ నుంచి వచ్చిన పాస్ కావాలని... తిప్పుతున్నారని వాపోయారు.
వైద్య పరీక్షలు చేసి పంపించిన వారిని తిరిగి వెనక్కి పంపగా.. ఎటు వెళ్లాలో తెలియక బోరున విలపిస్తున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు చొరవ తీసుకొని తమను సొంతూరు వెళ్లేలా చూడాలని ఆంధ్రా వాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కాంక్రీట్ మిక్సర్ ట్యాంక్లో 18 మంది కూలీల ప్రయాణం