ETV Bharat / state

'మునుగోడు పోరు'లో ప్రచార హోరు.. దూకుడుగా ప్రజల్లోకి అభ్యర్థులు.. - MUNUGODE BYPOLL CAMPAIGNS LATEST NEWS

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు.. సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 7 మండలాల్లో గులాబీదళం మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలను మోహరించింది. కారుకే పట్టం కట్టాలంటూ పల్లెపల్లెను చుట్టేస్తున్నారు. భాజపా నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కమలం అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి గ్రామగ్రామాన తిరుగుతున్నారు. భాజపా, తెరాసకు దీటుగా కాంగ్రెస్​ నేతలు ప్రజాక్షేత్రంలో మకాం వేశారు. అభ్యర్థి స్రవంతి సైతం ఆడబిడ్డను ఆశీర్వదించాలంటూ ఓట్లు అడుగుతున్నారు.

'మునుగోడు పోరు'లో ప్రచార హోరు.. దూకుడుగా ప్రజల్లోకి అభ్యర్థులు..

author img

By

Published : Oct 13, 2022, 8:13 PM IST

'మునుగోడు పోరు'లో ప్రచార హోరు.. దూకుడుగా ప్రజల్లోకి అభ్యర్థులు..

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను కలుస్తూ కారు పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు. మునుగోడులో రాజగోపాల్​రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయకుండా స్వార్థం కోసం రాజీనామా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్​పై ప్రజలకు పూర్తి విశ్వాసముందని ఎర్రబెల్లి పునరుద్ఘాటించారు.

మునుగోడు ఉపఎన్నికలో తెరాస గెలుపు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడం, గుండ్లబావిలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి బైక్ ర్యాలీ ద్వారా ఓట్లు అడిగారు. మహ్మదాపూర్​లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు.

ధర్మయుద్ధంలో ప్రజలు ఆశీర్వదించాలి..: మునుగోడు మండలం కొరటికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. తెరాసతో చేస్తున్న ధర్మయుద్ధంలో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మునుగోడు సమగ్రాభివృద్ధి కోసమే పదవీ త్యాగం చేసి ప్రజాతీర్పు కోసం బ్యాలెట్​ పోరులో పాల్గొంటున్నట్లు వివరించారు. చౌటుప్పల్​లో కోమటిరెడ్డి సతీమణి లక్ష్మి ప్రచారం నిర్వహించారు. రాజ్​గోపాల్​రెడ్డిని ప్రజలు ఆదరిస్తే.. వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆమె విజ్ఞప్తి చేశారు.

వజ్రాయుధంతో బుద్ధి చెప్పాలి..: యాదాద్రి భువనగరి జిల్లా నారాయణపూర్​ మండలం సర్వేల్​లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏలుతున్న భాజపా, తెరాస నేతలకు వజ్రాయుధం ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. స్రవంతికి మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.

ఇవీ చూడండి..

మునుగోడులో నేతల వసతి కోసం గుడారాలు

జాతరలో బోర్ కొట్టి చెరువు గట్టున వాకింగ్.. వజ్రం దొరికి రాత్రికి రాత్రే లక్షాధికారిగా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.