పురపాలిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లు రాబట్టుకునేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... తమ పార్టీయేతర పక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం పార్టీకి తెరాసనే తొత్తుగా మారిందని ఘాటైన విమర్శలు చేశారు.
పురపాలిక ఎన్నికల సన్నాహకంలో భాగంగా నల్గొండలో పర్యటించిన లక్ష్మణ్... జిల్లా నాయకులతో భేటీ అయ్యారు. ఎదుగుతున్న భాజపాను ఎదుర్కోలేకే.. తెరాస, కాంగ్రెస్, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయని ఆయన విమర్శించారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు