నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన లక్ష్మీనారాయణ క్యాన్సర్ రోగుల కోసం ఉడతా భక్తిగా ఏడాదిగా పెంచుకున్న తన జుట్టుని దానం చేశాడు. తన వంతు బాధ్యతగా క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారుల ముఖంలో... చిరునవ్వు చూడటానికి ఈ పనికి పూనుకున్నానని అన్నాడు. సంవత్సరం క్రితం ఈ లక్ష్యంతోనే జుట్టును పెంచానని తెలిపాడు. ఇంట్లో వారు ప్రోత్సహించారన్నారు. లక్ష్మీనారాయణతో పాటు తన తల్లి నాగమణి సైతం హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు వెంట్రుకలను ఇచ్చారు.
సైదయ్య, నాగమణి దంపతుల చిన్న కుమారుడు లక్ష్మీనారాయణ... ఉన్నత విద్యను అభ్యసించి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. పేదలకు పలుమార్లు దుప్పట్లు పంపిణీ చేశాడు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి తనలోని సామాజిక స్పృహను చాటుకున్నాడు.
ఇదీ చదవండి: 'చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వరూ..'