నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన గంగుల వెంకన్న అనే యువకుడు ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకుంటానని నమ్మబలికడంతో ఇరువురు శారీరకంగా ఒక్కటైయ్యామని... ఇప్పుడు అతను పెళ్లికి నిరాకరించాడని ఆమె తెలిపింది. తనను మోసం చేయవద్దని... పెళ్లి చేసుకోవాలని యువకుడిని నిలదీసింది. దీంతో వెంకన్న కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
తాను ప్రేమించిన వ్యక్తి వచ్చి తనను వివాహం చేసుకోవాలని... ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. అతనితో పెళ్లి చేసి తనకు న్యాయం చేయాలని ఆ అమ్మాయి కోరుతోంది. కొందరు గ్రామస్థులు, యువతి బంధువులు మద్దతుగా నిలిచారు.
ఇదీ చూడండి: ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ పేరుతో అమ్మాయిలకు వల