నాగార్జునసాగర్ జలాశయంలో వరద క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. సాగర్ జలాశయం దాదాపుగా పూర్తి స్థాయిలో నిండి ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో లక్ష 15 వేల క్యూసెక్కుల నీటి వచ్చి చేరుతోంది. దానితో జలాశయం 5 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే గుండా 74,865 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడగులు కాగా ప్రస్తుతం 589.80 అడగులకు చేరింది. సాగర్ జలాశయం నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 311.92 టీఎంసీలకు చేరుకుంది. ఈ క్రమంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం సాగర్ జలాశయం నుంచి లక్ష 15 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా వెళ్తోంది.