నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్నందున అధికారులు రెండు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 5000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా... ప్రస్తుతం 635 అడుగుల వరకు నీరుంది. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్త గేటు అమర్చారు. నీటి మట్టం పెరిగితే... ఒత్తిడితో మళ్ళీ గేటు కొట్టుకుపోయే ప్రమాదమున్నందున రెండు గేట్లు అడుగున్నర మేరకు ఎత్తి 1450 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి: 'గాడీ మీద పోతున్న రేవంత్‌ను.. గడబిడ జేసిండ్రు'