పాలుకారే ఒళ్లు, ముద్దులొలికే మోము, 11 నెలల ప్రాయం, ఇప్పుడిప్పుడే బోర్ల పడుతున్నాడు. కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న కొడుకును చూస్తూ మురిసిపోయిన ఆ తల్లి... బిడ్డ కోసం పాలు వేడిచేసి తీసుకొచ్చింది. పాలు బాగా వేడిగా ఉండడం వల్ల పాలగిన్నెను కుర్చీలో పెట్టి వంటగదిలోకి వెళ్లింది. కేరింతలు కొడుతున్న బిడ్డ ఒక్కసారిగా కెవ్వుమన్నాడు. ఉలిక్కిపడిన ఆమె గదిలోకొచ్చి బిడ్డను చూసి ఆ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. వేడిపాలు మీదపడి తన బిడ్డ ఒళ్లంతా బొబ్బలెక్కిపోయింది. కాలిన గాయాలతో అల్లాడిపోతున్న చిన్నారిని హుటాహుటిన హైదరాబాద్‌లోని పారమిత ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి శరీరం 38శాతం కాలిపోయింది. చికిత్స చేస్తే బతికే అవకాశం ఉందంటున్నారు వైద్యులు, కానీ రోజుకు రూ.20వేల వరకు ఖర్చవుతుంది.
"మీకు చేతిలెత్తి మొక్కుతాను. నా కొడుకును బతికించుకునేందుకు మీకు తోచినంత సాయం చేయండి. వేడిపాలు మీదపడి నాబిడ్డ ఒళ్లు కాలిపోయింది. కూలి చేసుకుని బతికేటోళ్లం.. ఆస్పత్రి ఖర్చులు భరించలేని బతుకులు మావి. మీ కాళ్లకు మొక్కుతా నా బిడ్డను బతికించండి" అంటూ తన 11 నెలల బిడ్డ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ఓ తల్లి అశ్రునయనాలతో దాతల సాయాన్ని అర్థిస్తోంది(please save my child).
వేడిపాలు మీదపడి నా బిడ్డ ఒళ్లు కాలిపోయింది. రోజుకు వేలల్లో ఖర్చవుతోంది. ఆపరేషన్ చేయిస్తే నా బిడ్డ బతుకుతాడని డాక్టర్లు చెబుతున్నారు. నేను, నా భర్త కూలికెళ్తేనే పూట గడుస్తుంది. దాతలు స్పందించి నా బిడ్డను బతికించాలని చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు చేసే సాయంతో నా బిడ్డ నాకు దక్కుతాడు(please save my child). - బాలుడి తల్లి.
బాలుడి చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు ఈ నంబర్‌ను సంప్రదించగలరు. 9494872596 |
ఇదీ చూడండి: అంధకారంలోకి నెట్టిన ప్రమాదం.. ఆసరా కోసం ఎదురుచూపులు