గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేస్తోందని నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ఠాకూర్ బాలాజీ సింగ్ తెలిపారు. జిల్లాలోని కల్వకుర్తి మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ సునీత అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు సందర్శించే ముందు అక్కడి ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వాలని కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడి.. తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులతో గవర్నర్ సమీక్ష