క్రిమీ సంహారక మందు ప్రభావంతో మహిళ మృతి నాగర్ కర్నూలు జిల్లా పెద్ద ముద్దునూరులో విషాదం చోటుచేసుకుంది. పత్తి పంటకు క్రిమిసంహారక మందు పిచికారి చేసి భార్యభర్తలు విష ప్రభావానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. పెద్ద ముద్దునూరుకు చెందిన కురుమయ్య (40), చిట్టెమ్మ (35) దంపతులు గత కొన్నేళ్లుగా అచ్చంపేట మండలం వెల్టూరులో పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నారు. కీటకాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల గత శుక్రవారం పంటకు క్రిమిసంహారక మందు పిచికారి చేశారు. దీనితో భార్యాభర్తలిద్దరూ విష ప్రభావానికి గురయ్యారు. అనంతరం బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చిట్టెమ్మ చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది. భర్త కురుమయ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఇదీ చూడండి:20వ సారి గర్భం దాల్చిన మహిళ..!