ETV Bharat / state

భార్య చేతిలో నడిరోడ్డుపై భర్తకు దేహశుద్ధి

మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వదిలేసినందుకు ఓ వ్యక్తికి అర్ధరాత్రి నడి రోడ్డుపై దేహశుద్ధి జరిగింది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.

భార్య చేతిలో నడిరోడ్డుపై భర్తకు దేహశుద్ధి
author img

By

Published : Jul 18, 2019, 1:29 PM IST

అచ్చంపేట మండలం అనంతవరానికి చెందిన వరలక్ష్మీకి, నాగర్​కర్నూల్​కు చెందిన యుగంధర్​ గౌడ్​కు 7 సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికి బాబు పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను వేధిస్తున్నాడంటూ... పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరస్పరం కేసులు కూడా పెట్టుకొని, విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. నాగర్​కర్నూల్​లో ఆ మహిళతో ఉన్న భర్తను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకునేందుకు... మహిళ సంఘాలు, పోలీసులు, మీడియాతో కలిసి అక్కడికి వెళ్లింది. పోలీసుల సమాచారంతో యుగంధర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. భర్త అక్కడ లేడని నిర్ధరించుకొని తిరిగి వెళ్తుండగా... మద్యం మత్తులో ఉన్న భర్త... ఎదుకు వచ్చావంటూ భార్యపై దౌర్జన్యం చేశాడు. వెంటనే బంధువులతో కలిసి... తనకు ఎందుకు అన్యాయం చేశావని నిలదీసి నడిరోడ్డుపై అర్ధరాత్రి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

భార్య చేతిలో నడిరోడ్డుపై భర్తకు దేహశుద్ధి

ఇదీ చూడండి: "వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి"

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.