నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్లలో రైతులు భూములు ఇచ్చేదిలేదని చెప్పినా బలవంతంగా లాక్కుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రావు అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాలువలో భూములు కోల్పోతున్న ప్రాంతాల్లో పర్యటించారు. రైతులతో కలిసిమామిడి తోటలు, పంట భూములను పరిశీలించారు. అనంతరం కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి : కేసీఆర్ కేబినెట్లో 18కి చేరిన మంత్రుల సంఖ్య