Mother Selfie Video on Property Disputes with Sun : ఆస్తి కోసం కన్న తల్లి చనిపోయినట్లు సృష్టించడానికి ప్రయత్నించాడు ఓ కన్న కుమారుడు. అమ్మ చనిపోయినట్లు ఫ్లెక్సీలు (Flexi) ఏర్పాటు చేసి బంధువులు, గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేశాడు. తీరా ఈ విషయం తల్లికి తెలియడంతో 'నేను బతికే ఉన్నాను రా బిడ్డ..' అని సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో కుమారుడి అసలు డ్రామా బయటపడింది. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చిన ఈ ఘటన నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలోని వేముల కౌసల్య అనే వృద్ధురాలు నివసించేది.
ఆస్తులు పంచాక వృద్ధులను పట్టించుకోని పిల్లలు.. అధికారులకు ఫిర్యాదు.. వెంటనే తిరిగి..
Mother selfie video : కొన్నేళ్ల క్రితం కుమారుడు, కోడలు మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఇరువురు కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో కోడలు.. వృద్ధురాలు కౌసల్యను, తన ఇద్దరు కుమారులు, కుమార్తెను తీసుకొని వికారాబాద్ జిల్లాలో నీధరూర్ మండలంలో తన తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ తన అత్త, పిల్లలతో కలిసి వేరుగా నివస్తోంది. ఇది ఇలా ఉండగా.. ఈనెల 31వ తేదీన కౌసల్య మృతి చెందినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ విషయం వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఉంటున్న వృద్ధురాలు కౌసల్యకు తెలిసింది.
తల్లిని నరికి.. తల చేతితో పట్టుకుని పరిసరాల్లో తిరిగిన కుమారుడు
"నేను చనిపోలేదు. మంచిగానే ఉన్నాను. ఆస్తి కోసం నా కుమారుడు నేను చనిపోయినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి డ్రామా ఆడాడు. నా కోడలు, వాళ్ల బంధువులు మంచిగా చూసుకుంటున్నారు. కేవలం ఆస్తి కోసమే నా కుమారుడు ఇలా చేశాడు."- కౌసల్య, బాధితురాలు
Property Disputes : దీంతో కౌసల్య తాను బతికే ఉన్నానని ఓ వీడియోను విడుదల చేసింది. తన కుమారుడు రాజు ఆస్తి కోసం డెత్ సర్టిఫికెట్, ఇతర పత్రాలు సృష్టిచేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడాని వృద్ధురాలు వాపోయింది. తన కోడలు, ఇద్దరు మనవాళ్లు మనవరాలితో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నట్లు వీడియోలో పేర్కొంది. తన ఆధార్ కార్డు (Aadhaar Card) చూపిస్తూ.. 'బిడ్డా నేను బతికే ఉన్నా' అంటూ వృద్ధురాలు కన్నీంటి పర్యంతమైంది. తన కోడలు చాలా జాగ్రత్తగా చూసుకోంటుందని వీడియోలు పేర్కొంది. కేవలం ఆస్తి కోసమే తన కుమారుడు డ్రామా ఆడుతున్నాడని ఆరోపించింది. ఈ వీడియో తన బంధువులకు, సన్నిహితలకు పంపించడంతో వైరల్గా మారింది.
కిష్టవ్వ కథ చితికి.. ఎట్టకేలకు అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్న పిల్లలు
"ఆస్తి కోసం నా భర్త రాజు మా అత్తమ్మ చనిపోయినట్లు డ్రామా ఆడాడు. ఫ్లేక్సీలు కొట్టించి ఆమె మృతి చెందినట్లు ప్రసారం చేశాడు. తద్వారా డెత్ సర్టిఫికేట్ పొందేందుకు ప్రయత్నించాడు. ఆమె ఆరోగ్యంగా మంచిగానే ఉంది."- కౌసల్య కోడలు
ప్రేమించిన వ్యక్తి కోసం.. రూ.2వేల కోట్ల ఆస్తి వదులుకున్న బిజినెస్ టైకూన్ కూతురు
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఆభరణాలు, చీరలు కేవలం గిఫ్ట్లే!: హైకోర్టు