ETV Bharat / state

ఎమ్మార్వో కార్యాలయం ముందు వంటావార్పు - mro

నాగర్​కర్నూల్ జిల్లా బిజినపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు. కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

వంటావార్పు
author img

By

Published : Sep 5, 2019, 5:54 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. బిజినపల్లి మండలంలోని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయంలోని అధికారులు స్పందించకపోవడం వల్ల వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రైతుల భూ సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని.. పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని వాపోయారు. తమ సమస్యల పట్ల అధికారులకు ఎన్నో దఫాలుగా విన్నవించుకున్నా... పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించేంత వరకు ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.

ఇవీ చూడండి : పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రద్దు చేయాలి

Intro:TG_MBNR_12_5_MRO_DHARNA_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల తాసిల్దార్ కార్యాలయం ముందు రైతులు ఆందోళన బాట పట్టారు. బిజినాపల్లి మండలంలోని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఉదయం నుంచి వినూత్న నిరసన చేపట్టారు. ఎంత వరకు రెవెన్యూ కార్యాలయంలోని అధికారులు స్పందించకపోవడంతో మధ్యాహ్నం ఇక్కడే ఉండి వంటలు వండి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రైతులకు ఉన్న భూ సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని ఇంతవరకు పట్టా పాస్ పుస్తకాలు రాలేదని పాస్ పుస్తకాలలో తప్పులు దొర్లాయని విరాసత్ కాలేదని పాసుపుస్తకం వచ్చిన రైతుబంధు పథకం ఇంతవరకు అమలు కాలేదని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయని అధికారులకు ఎన్నో రోజుల నుంచి పలు దఫాలుగా విన్నవించుకున్నా పెడచెవిన పెట్టారు. తప్ప ఇంతవరకు స్పందించడం లేదని దీంతో జిల్లా కలెక్టర్ వచ్చేంతవరకు ఇక్కడే బైఠాయించి ఆందోళన చేపడతామని రైతులు అంటున్నారు.....byte
bytes:- రైతులు

Body:TG_MBNR_12_5_MRO_DHARNA_AVB_TS10050

Conclusion:TG_MBNR_12_5_MRO_DHARNA_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.