ETV Bharat / state

సాగు 'బడి'లో బతుకు పాఠాలు - వందేమాతంర ఫౌండేషన్​ అక్షరవనం కథనం

దేశంలో 60శాతానికి పైగా జనాభాకు వ్యవసాయమే జీవనాధారం. కానీ నేటి తరంలో చాలా మందికి పంటలు ఎలా పండిస్తారో తెలియదు. బియ్యమంటే దుకాణాల్లో దొరికే వస్తువనే తప్ప... అదీ ఓ పంటేనని తెలియని పిల్లలూ లేకపోలేదు. ఈ తరుణంలో చదువులో సాగును భాగం చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది కల్వకుర్తి పట్టణంలోని అక్షరవనం. లాక్​డౌన్​ సమయంలో ఆహారం, కూరగాయల కొరత వల్ల ఏర్పడిన సమస్య చూపించిన పరిష్కారమే.. అక్షరవనానికి శ్రీకారం. సాగుపట్ల విద్యార్థి దశలోనే ఓ అవగాహన కల్పించేందుకు అక్షరవనంలో అమలు చేస్తున్న సాగు పాఠాలపై ఈటీవీ భారత్​ కథనం.

సాగుబడిలో బతుకు పాఠాలు
సాగుబడిలో బతుకు పాఠాలు
author img

By

Published : Jan 12, 2021, 12:54 PM IST

సాగుబడిలో బతుకు పాఠాలు

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో.. వందేమాతరం ఫౌండేషన్ నిర్వహించే అక్షరవనం ఓ ప్రయోగశాల. మెరుగైన విద్యావిధానం కోసం వివిధ రకాల అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో వినూత్న విధానాలు అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కొత్త పద్ధతిని అవలంభిస్తోంది. అక్కడ విద్యనభ్యసించే పిల్లలకు సాగును చదువులో భాగం చేసింది. రోజూ రెండు గంటల పాటు సాగు పాఠాల్ని స్వీయ అనుభవంతో నేర్చుకుంటున్నారు అక్కడి విద్యార్థులు. ఆరు నెలలుగా నిత్యం ఆహారానికి అవసరమయ్యే కూరగాయలు, ఆకుకూరల్ని సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. పండించిన వాటిని తమ ఆహార అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. పాలు పితకడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం, వెల్డింగ్​ వంటి వృత్తులను చదువులో భాగంగా నేర్చుకుంటున్నారు.

ఓ సమస్య చూపించిన పరిష్కారం

అక్షర వనంలోని విద్యార్ధులు ఏడాదిలో 20రోజులు మాత్రమే తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు. లాక్​డౌన్ సమయంలో కూరగాయలు, ఆకుకూరల కోసం ఇబ్బందులు తలెత్తడం వల్ల సాగు పాఠాలకు శ్రీకారం చుట్టారు. పదో తరగతి.. ఆ పైబడి చదువుతున్న సీనియర్ విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఓ ప్రధాన పంట అప్పగించారు. కేటాయించిన పంటకు అనుబంధంగా ఇతర పంటల్ని పండించవచ్చు. కావాల్సిన విత్తనాల్ని అక్షరవనం సమకూర్చుతుంది. పరికరాలు, సామాగ్రిని అందిస్తుంది. కొంత స్థలాన్ని కేటాయిస్తుంది. కేటాయించిన కూరగాయలు, ఆకుకూరల్ని ఎలా పండిస్తారు? సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి? చీడపీడలు ఆశిస్తే ఏమి చేయాలనేది ఇంటర్ నెట్, సామాజిక మాధ్యమాల్లో చూసి విద్యార్థులు నేర్చుకుంటారు.

సేంద్రియ ఎరువులతోనే సాగు..

అప్పగించిన ప్రధాన పంటపైనే పూర్తిస్థాయి దృష్టిసారించే సీనియర్లు... సాగు మెళకువల్ని జూనియర్లకు, తోటి మిత్రులకు నేర్పుతారు. అలా సుమారు 20కి పైగా కూరగాయలు, 10కి పైగా ఆకుకూరల్ని ప్రస్తుతం విద్యార్థులు తమకు కేటాయించిన చిన్నపాటి స్థలాల్లో సాగు చేస్తున్నారు. జీవామృతం, వేపనూనె, పశువుల ఎరువు లాంటి సేంద్రీయ ఎరువుల్ని మాత్రమే వాడతారు.

రండి.. రండి.. ఇది మేము పండించిన పంట

విద్యార్థులను సాగు దిశగా ప్రోత్సహించేందుకు నిర్వాహకులు వారికి క్రెడిట్ పాయింట్లు కేటాయించారు. సొంతంగా కూరగాయలు, ఆకుకూరల్ని పండించి వంటగదిలో అందిస్తే వారికి క్రెడిట్ పాయింట్లు ఇస్తారు. గిరాకి ఉన్న పంటను అందిస్తే.. వారికి ఎక్కువ పాయింట్లు, తక్కువగా అవసరం ఉండే వాటిని సాగుచేస్తే తక్కువ పాయింట్లు ఇస్తారు. తద్వారా అన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలు అందరు విద్యార్థులు పండించడంతో పాటు.. వారి ఆహార అవసరాలు తీరాలన్నది క్రెడిట్ పాయింట్ల ప్రధాన ఉద్దేశం. 8వేల క్రెడిట్ పాయింట్లు సాధిస్తే.. వారికి కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఓ అవగాహన ఏర్పడినట్లు. అలా సాగులో పాయింట్లు సంపాదించేందుకు విద్యార్థులు పోటీ పడుతున్నారు. పండించడమే కాదు.. తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అక్షరవనానికి వస్తే తమ పొలాన్ని, పండించిన పంటను చూపిస్తూ మురిసిపోతున్నారు.

తెలియాలి కదా..!

సాగుచేసే క్రమంలో మొదట్లో కొంత ఇబ్బందులు ఎదురైనా తర్వాత మంచి దిగుబడులతో పంటలు పండిస్తున్నామని చెబుతున్నారు విద్యార్ధులు. రైతులు పంట పండించేందుకు ఎంతగా కష్టపడతారు.. ఫలితాలు ఎలా ఉంటాయి.. తినే ఆహారం ఎంత విలువైందో సాగుపాఠాల వల్ల తెలుసుకున్నామని అంటున్నారు. రైతులు పండిస్తేనే దేశమంతా తినే పరిస్థితి దేశంలో ఉందని... చదువులో భాగంగానే సాగుపై అవగాహన కల్పిస్తే కనీసం ఎవరి కూరగాయలు వాళ్లు పండించుకోగలుగుతారని పిల్లలు అభిప్రాయ పడ్డారు.

వృత్తి విద్యల్లోనూ నైపుణ్యం సాధిస్తూ..

కరోనా కారణంగా పెరటి తోటల పెంపకంపై ఇప్పడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. భవిష్యత్తు ఆహార అవసరాలకు తీర్చుకోవడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని పిల్లలు చెబుతున్నారు. సాగు పాఠాలే కాదు.. పశువుల పాకలో పేడ తీయడం, వాటితో జీవామృతం, పశువుల ఎరువు తయారు చేయడంపైనా శిక్షణ ఇస్తున్నారు. వెల్డింగ్ లాంటి వృత్తులు నేర్చుకుంటున్నారు.

చదువులోనూ భాగం చేయాలి...

చదువు పేరుతో పుస్తకాలతో కుస్తీ పడుతూ... ర్యాంకుల కోసం పాకులాడుతున్న నేటితరం విద్యార్థులు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే అక్షరవనం నూతన విధానాన్ని అమలు చేస్తోంది. విద్యార్థి దశలోనే సాగు, వృత్తుల పట్ల శిక్షణ పొందడం వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని చెబుతున్నారు తల్లిదండ్రులు. కేంద్రం ప్రకటించిన నూతన విద్యావిధానంలోనూ ఆరో తరగతి నుంచి వృత్తి విద్యను భాగం చేయాలని సూచించారు.

ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం

ఈ మేరకు పాఠశాలల్లో సాగుపాఠాలు ఎలా నేర్పొచ్చన్న అంశంపై విధివిధానాలు రూపొందిస్తున్నామని అక్షరవనం నిర్వాహకులు శ్రీపతిరెడ్డి వెల్లడించారు. స్థలాలున్న పాఠాశాలలు, స్థలాలు లేని బళ్లలో సాగు పాఠాలు ఎలా నేర్పాలన్న అంశంపై ప్రస్తుతం పరిశోధన చేస్తున్నామని చెప్పారు.

వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునేందుకు నేటి యువత ముందుకు రావడం లేదు. చదువుకునే పిల్లల్లో వ్యవసాయం అంటే కనీస అవగాహన ఉండడం లేదు. మన ఆహార అవసరాల్ని తీర్చుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి పంటల్ని దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో సాగుపై చదువుకునే వయసులోనే కనీస అవగాహన కల్పిస్తే.. ఆహార అవసరాలు ఎవరికి వారు తీర్చుకునే అవకాశం ఉంది. అక్షరవనంలో సాగు పాఠాల గురించి తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఇతర పాఠశాలల్లో చదివే తమ పిల్లల్ని శిక్షణ కోసం కొంత కాలం పాటు అక్షరవనంలో చేర్చుతున్నారు.

ఇదీ చూడండి: 96 ఏళ్ల బామ్మ.. అదిరే ముగ్గేసెనమ్మ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.