నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని తిమ్మరాశిపల్లి గ్రామం వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ) కాలువ నీటి ప్రవాహ ఉధృతికి యూటీ కాలువ తెగిపోయింది. గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు చేరడం వల్ల తిమ్మరాశిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు కేఎల్ఐ కాలువ కట్ట పైనుంచి ప్రమాదకరంగా రాకపోకలను కొనసాగిస్తున్నారు.
యూటీ కాలువ గత కొన్ని రోజులుగా ప్రమాదకరంగా ఉందని కేఎల్ఐ పర్యవేక్షణ అధికారులకు, గుత్తేదారులకు చెప్పినా పట్టించుకోలేదని రైతులు చెప్పారు. వెంటనే కాలువకు మరమ్మతులు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి తీపికబురు