నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన కూలీలు ఉపాధి హామీ పనులుకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా... ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఉపాధి హామీ పనుల్లో భాగంగా సంపు గుంతలు తీయడానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో ట్రాక్టర్ బోల్తాపడి అంజనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామస్థులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రభుత్వం వారికి సహాయం చేయాలని కోరుతున్నారు.
ఉపాధి కోసం వెళ్లారు... ఆసుపత్రి పాలయ్యారు...
ఉపాధి కోసం వారంతా ఉదయాన్నే బయలుదేరారు. ట్రాక్టర్ బోల్తాపడి తీవ్రగాయలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.