జోగులాంబ గద్వాల జిల్లా చెనుగోనుపల్లిలో నాగర్‌కర్నూల్ తెరాస పార్లమెంట్ అభ్యర్థి పి.రాములు తరఫున ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంది ఎల్లయ్యతో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాములును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, ఎంపీగా రాములును గెలిపిస్తే ఇంకా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఇవీ చూడండి: కారెక్కిన కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి