ETV Bharat / state

అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం - అచ్చంపేట తెరాస కైవసం

achampet
trs won in achampet municipality
author img

By

Published : May 3, 2021, 1:45 PM IST

Updated : May 3, 2021, 3:43 PM IST

13:41 May 03

అచ్చంపేట మున్సిపాలిటీ కైవసం చేసుకున్న తెరాస

అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం తెరాస కైవసం

 నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది.  మొదటి రెండు రౌండ్లు ఉత్కంఠ భరితంగా లెక్కింపు జరిగింది. అధికార తెరాసకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. తొలి రెండు రౌండ్లలో తెరాస, కాంగ్రెస్ చెరో 6 స్థానాల్లో గెలుపొందాయి. మూడో రౌండ్​లో తెరాస అభ్యర్థులు ఐదుగురు గెలుపొందగా, భాజపా ఒక్క స్థానంలో విజయం సాధించింది. చివరి రౌండ్​లో రెండు స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. అధికార తెరాస 2,3,4,5,6,12,13,15,16,17,18,19,20 వార్డులు దక్కగా..  కాంగ్రెస్ 1,7,8,10,11,14 వ వార్డుల్లో విజయం సాధించింది. 9వ వార్డు నుంచి భాజపా అభ్యర్థి విజయం సాధించారు.  

మొత్తం 20 వార్డులకు గాను 13స్థానాలను అధికార తెరాస గెలుచుకుని ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ 6, భాజపా 1 స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నాయి. గత ఎన్నికల్లో 20 వార్డులను క్లీన్ స్వీప్ చేసిన తెరాసకు ఈసారి ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చాయి. పురుపాలికలో 20 వార్డుల్లో మొత్తం 66 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఇదీ చూడండి: కొత్తూరు మున్సిపాలిటీ తెరాస కైవసం

Last Updated : May 3, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.