ETV Bharat / state

కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి ఎన్నికల ప్రచారం - నాగర్​కర్నూల్​ ఎంపీ అభ్యర్థి

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెరాస నేతల ప్రచారం జోరందుకుంది. అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువయ్యేందుకు ఎంపీల తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బాధ్యతను నిర్వహిస్తున్నారు. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి పర్యటించారు.

తెరాస ప్రచారం
author img

By

Published : Mar 30, 2019, 3:30 PM IST

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పార్లమెంట్ అభ్యర్థి రాములు తరఫున ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి తెరాసకే ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టుకునే వీలుంటుందని స్పష్టం చేశారు.

ప్రచారం అడ్డిగింత

కసిరెడ్డి ఎల్లికట్ట గ్రామానికి ప్రచారానికి వెళ్లగా ఓ వర్గం వారు ఆయనను అడ్డుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి రావాలని నినాదాలు చేశారు. ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం ఎమ్మెల్సీ గ్రామంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు.

ఇదీ చదవండి :ఫేస్​బుక్​లో మరో పోస్ట్​.. స్పందించిన సీఎంఓ

Intro:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లో పార్లమెంట్ అభ్యర్థి రాములు తరపున ఎన్నికల ప్రచారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి నిర్వహించారు ఈ ప్రాంతానికి చెందిన నాయకుడిని గెలిపించుకోవడం వల్ల నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రజలకు సూచించారు గ్రామంలో వంద శాతం ఓట్లు తెరాస పడాలని కేంద్రంలో లో 16 మంది ఎంపీలు తెలంగాణ వాళ్లు ఉండాలని అని పిలుపునిచ్చారు

Body:కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కి తెరాస లోని మరో వర్గం గ్రామం లోనికి రావద్దని నినాదాలు చేశారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎంపీ అభ్యర్థి రామునితో కలిసిరావాలని డిమాండ్ చేశారు దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చారు అనంతరం గ్రామంలో లో పర్యటించి తెరాసకు ఓటు వేయాలని కోరారు

Conclusion:ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 16 మంది ఎంపీలను గెలిపించి తీరాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.